bittiri satti: నా వెనుక ఏ శక్తీ లేదు: బిత్తిరి సత్తిపై దాడి చేసిన మణికంఠ!

  • మణికంఠను రిమాండ్ కు తరలించిన పోలీసులు
  • తెలంగాణ యాసను వెక్కిరిస్తున్న బిత్తిరి సత్తి
  • మీడియాతో మణికంఠ
ఓ టీవీ చానల్ లో తెలంగాణ యాసలో యాంకరింగ్ చేస్తూ బిత్తిరి సత్తిగా పేరు తెచ్చుకున్న కావలి రవికుమార్ పై దాడికి పాల్పడిన మణికంఠను ఈ ఉదయం పోలీసులు రిమాండ్ కు తరలించారు. రిమాండ్ కు మణికంఠను తీసుకు వెళుతున్న వేళ, తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ దాడి తనతో ఎవరూ చేయించలేదని స్పష్టం చేశాడు. తన వెనుక ఏదో శక్తి ఉందని వచ్చిన వార్తలు అవాస్తవమని, సత్తి వాడుతున్న భాష తెలంగాణ యాసను వెక్కిరించేలా ఉన్నందునే దాడి చేశానని అన్నాడు. భాష గౌరవాన్ని బిత్తిరి సత్తి దెబ్బతీస్తున్నాడని ఆరోపించాడు. కాగా, బంజారాహిల్స్ లోని చానల్ కార్యాలయం వద్ద సత్తిపై మణికంఠ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలు సెక్షన్ల కింద మణికంఠపై కేసు పెట్టిన పోలీసులు అతన్ని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.
bittiri satti
manikantha
telangana slant

More Telugu News