సాయిధరమ్ తేజ్ నా ఇంట్లో దీపం పెట్టాడు: 'జవాన్' దర్శకుడు బీవీఎస్ రవి
- తేజు 'సుప్రీమ్' చేస్తుండగా 'జవాన్' కథ చెప్పాను
- 'నక్షత్రం'లో ఆయన నిడివి పెరగడంతో 'జవాన్' స్టార్ట్ అవడం లేటయింది
- ఈ సినిమా కోసం ఏడాదికి పైగా ఎదురుచూశాను
"ఆ తరువాత సాయిధరమ్ తేజ్ 'తిక్క' .. 'విన్నర్' .. 'నక్షత్రం' మూడు సినిమాలు చేశాడు. 'నక్షత్రం' సినిమాలో ఆయన పాత్ర నిడివి పెరిగిపోవడంతో .. నా సినిమా పట్టాలెక్కడానికి మరింత ఆలస్యమైంది. ఆ సినిమా చేసిన తరువాత ఆయన నా సినిమా చేస్తున్నట్టుగా చెప్పాడు. ఆయనతో సినిమా చేయడానికి ఏడాదికి పైగా ఎదురుచూస్తోన్న నాకు .. ఆ మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి .. నా ఇంట్లో ఆయన దీపం పెట్టినట్టుగా అనిపించింది" అన్నారు.