Telugudesam: టీడీపీ సీనియర్ నేత.. కర్నూలు జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు సంపతి కన్నుమూత

  • అనారోగ్యంతో బాధపడుతున్న ధనారెడ్డి
  • మంగళవారం రాత్రి విషమించిన ఆరోగ్యం
  • సంపతి మృతితో టీడీపీ నేతల దిగ్భ్రాంతి
టీడీపీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సంపతి ధనారెడ్డి (68) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ధనారెడ్డి మృతి విషయం తెలిసిన జిల్లా టీడీపీ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. టీడీపీ జిల్లా కోశాధికారిగా, ప్రధానకార్యదర్శిగా సేవలు అందించిన ధనారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
Telugudesam
Kurnool
Sampati Dhana Reddy

More Telugu News