Chandrababu: డిసెంబరు 3న దక్షిణ కొరియాకు ఏపీ సీఎం చంద్రబాబు

  • సియోల్, బుసాన్ నగరాల్లో పర్యటించనున్న బాబు
  • పారిశ్రామికవాడపై ఒప్పందం కుదిరే అవకాశం
  • కియో కార్ల కంపెనీని సందర్శించనున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డిసెంబరు 3న దక్షిణ కొరియా వెళ్లనున్నారు. సియోల్, బుసాన్ నగరాల్లో పర్యటిస్తారు. బుసాన్ నగరంలోని కియో కార్ల ఫ్యాక్టరీని సందర్శిస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై చర్చలు జరుపుతారు. ఇటీవల ఏపీలో పర్యటించిన దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తల బృందం తమకు రెండు వేల ఎకరాలు కేటాయిస్తే పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరిపింది.

కియో కార్ల పరిశ్రమను నిర్మిస్తున్న అనంతపురం జిల్లా పెనుకొండ లేదంటే కృష్ణపట్నం పోర్టు సమీపంలో భూమి ఇస్తే బాగుంటుందని దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తల బృందం ప్రభుత్వానికి తెలిపింది. కియో కంపెనీకి ప్రభుత్వం అందిస్తున్న సహకారం బాగుందని, తమకు కూడా భూమి కేటాయిస్తే పారిశ్రామిక వాడ నెలకొల్పుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు వారితో చర్చించి తుది రూపు ఇచ్చేందుకే ముఖ్యమంత్రి దక్షిణ కొరియా వెళ్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News