dinner: ఫలక్ నుమా ప్యాలెస్ లో మోదీ, ఇవాంకా, హేమాహేమీలు... విందు మెనూ ఇదే!

  • ఫలక్ నుమా ప్యాలెస్ లో మోదీ విందు
  • హాజరైన ఇవాంకా, పారిశ్రామిక వేత్తలు
  • నిజాంల ప్రతిష్ఠాత్మక 101 టేబుల్ పై విందు
ప్రధాని నరేంద్ర మోదీ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో ఇస్తున్న విందుకు ఇవాంకా ట్రంప్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, దౌత్యవేత్తలు, దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, టాటా గ్రూప్ సీఈవో చంద్రశేఖర్, మిట్టల్ తదితరులకు తోడు సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

ఈ విందును నిజాముల ప్రతిష్ఠాత్మక 101 టేబుల్ పై ఏర్పాటు చేశారు. ఈ విందులో అతిధుల కోసం వివిధ రకాలు పదార్థాలు తయారు చేసినట్టు షెఫ్ లు తెలిపారు. ఇటాలియన్, మొఘలాయ్ వంటకాలతో పాటు పది రకాల హైదరాబాదీ బిర్యానీలు, ముర్గ్ పీస్తా కా సలాడ్, సీతాఫల్ కుల్ఫీ, అఘజ్ సూప్, వాక్ఫా అనే షర్బత్, ఘోస్ట్ షికాంపురీ కీబాబ్, దహీ కే కీబాబ్, కుబానీ కే మలాయ్ కోఫ్తా, మెజ్ బన్, మహ్ గూల్ దస్తర్ క్వాన్, గులాబ్ జామ్ తదితర ఎన్నో వెరైటీలు అతిథుల కోసం సిద్ధం చేశారు. 
dinner
Narendra Modi
ivanka
tata
mittal
KCR
KTR

More Telugu News