ivanka trump: ఇవాంకా ధరించిన దుస్తులకు స్ఫూర్తి అదే!: డిజైనర్ నీతా లుల్లా

  • ఇవాంకా కోసం సరికొత్త అవుట్ ఫిట్ 
  • డిజైనర్ నీతా లుల్లా
  • రాధాకృష్ణుల దుస్తుల స్ఫూర్తిగా డిజైన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ తన వస్త్రధారణతో హెచ్ఐసీసీ జీఈ సదస్సులో పాల్గొన్న వారందర్నీ ఆకట్టుకున్నారు. ఆమె ధరించిన డ్రెస్ ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేశారు. ఆ డ్రెస్ ను బృందావన్ గార్డెన్స్‌లో కొలువైన రాధాకృష్ణుల దుస్తుల స్ఫూర్తితో తయారు చేశానని ఆమె అన్నారు.

వారణాసి నుంచి తెప్పించిన నాణ్యమైన దారాలతో ఆ దుస్తులను తయారు చేశామని చెప్పారు. ఇవాంకా కోసం ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయడం తనకు ఎంతో గౌరవం తెచ్చిందని ఆమె పేర్కొన్నారు. భారతీయత ఉట్టిపడేలా ఆమె దుస్తులను డిజైన్ చేశానని ఆమె అన్నారు. కాగా, నీతా లుల్లా దుస్తుల డిజైనర్‌ గా జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు.
ivanka trump
neeta lulla
Hyderabad
GES
HICC

More Telugu News