GES: వినూత్నంగా మిత్రా రోబో ద్వారా గ్లోబల్ సదస్సును ప్రారంభించిన మోదీ, ఇవాంకా

  • బెంగళూరు స్టార్టప్ తయారు చేసిన మిత్రా రోబో
  • రెండు నిమిషాలు మాట్లాడిన కేసీఆర్
  • ఉత్సాహంగా మాట్లాడిన ఇవాంకా ట్రంప్
జీఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ వినూత్నంగా ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన రోబో 'మిత్రా' ద్వారా సదస్సు ప్రారంభ వేడుకను ఆరంభించారు. కార్యక్రమ వ్యాఖ్యాత ఆహ్వానించగానే చిట్టిరోబో ఒకటి ప్రధాని ముందుకు వచ్చింది.

దాని స్క్రీన్ కు ఉన్న భారత్ ఫ్లాగ్ బటన్ ను మోదీ, అమెరికా ఫ్లాగ్ బటన్ ను ఇవాంకా ప్రెస్ చేయగానే సదస్సు ప్రారంభమైనట్టు స్క్రీన్ పై దృశ్యం కనిపించింది. అనంతరం రోబో అక్కడి నుంచి వెళ్లిపోగా..ముఖ్యమంత్రి కేసీఆర్ సభనుద్దేశించిన రెండు నిమిషాలు మాట్లాడగా, ఇవాంకా ట్రంప్ ఐదు నిమిషాలు మాట్లాడారు. ఆ తరువాత మోదీ మాట్లాడారు. 
GES
HICC
mitra robo
Hyderabad
ivanka
Narendra Modi

More Telugu News