shivabalaji: ఆ మాటలు నాకు చాలా బాధ కలిగించాయి .. మేకప్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేశాను: శివబాలాజీ

  • అది నా ఫస్టు సినిమా షూటింగ్
  • సినిమా ఫీల్డ్ నాకు కొత్త 
  • ఎక్స్ ట్రాగా ఓ వాటర్ బాటిల్ అడిగాను 
  • ప్రొడక్షన్ బాయ్ అంతమాట అనేశాడు   

"కెరియర్లో ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి .. అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్లినప్పుడే సక్సెస్ లు దొరుకుతుంటాయి. అలా అనుకున్నప్పటికీ ఏదో ఒక చేదు జ్ఞాపకం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి చేదు అనుభవం ఏదైనా ఉందా మీ జీవితంలో?" అనే ప్రశ్న తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వూలో శివబాలాజీకి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. " నేను సినిమాల్లోకి రావడం మా నాన్నకు ఇష్టం లేకపోవడం వలన, నా కెరియర్ జీరోతో మొదలైంది" అన్నాడు.

"నా ఫస్టు మూవీ 'ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ' షూటింగ్ జరుగుతోంది. ప్రొడక్షన్ వాళ్లు ప్రతి ఆర్టిస్టుకు ఓ వాటర్ బాటిల్ ఇచ్చేవాళ్లు. నాకు కూలింగ్ వాటర్ తాగడం అలవాటు. అందువలన నేను ఒక వాటర్ బాటిల్ తీసుకుని .. ఐస్ బాక్స్ లో పెట్టడం కోసం మరో బాటిల్ ను అడగమని నా అసిస్టెంట్ తో చెప్పాను. 'మా సార్ కి ఇంకో వాటర్ బాటిల్ కావాలి' అని నా అసిస్టెంట్ ప్రొడక్షన్ బాయ్ ను అడిగాడు. అప్పుడతను 'మీ సార్ కి ఒక బాటిల్ ఇవ్వడమే ఎక్కువ, రెండవ బాటిల్ అవసరం లేదు' అన్నాడు. అంతే, ఆ మాటలు నాకు చాలా బాధ కలిగించాయి .. మేకప్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు.    

  • Loading...

More Telugu News