kcr: ఇక్క‌డ పెట్టుబ‌డుల‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి!: హెచ్ఐసీసీలో కేసీఆర్ ప్రారంభోప‌న్యాసం

  • అంద‌రికీ స్వాగ‌తం
  • టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు
  • హైద‌రాబాద్‌లో ప్ర‌పంచ 5 గొప్ప సంస్థ‌లు ఉన్నాయి
  • పెట్టుబడుల‌కు ఎన్నో అవ‌కాశాలు

హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో ప్రారంభ‌మైన జీఈఎస్‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభోప‌న్యాసం ఇచ్చారు. భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడి స‌ల‌హాదారు ఇవాంక ట్రంప్‌తో పాటు ఔత్సాహిక‌ పారిశ్రామిక వేత్త‌ల‌కు సాద‌రంగా స్వాగతం ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇస్తోంద‌ని చెప్పారు. ప్ర‌పంచంలోని 5 గొప్ప సంస్థ‌లు హైద‌రాబాద్‌లో ఉన్నాయ‌ని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి సంస్థ‌లు ఉన్నాయ‌ని తెలిపారు.

ఇక్క‌డ పెట్టుబ‌డుల‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయ‌న్నారు. టీఎస్ ఐపాస్‌తో సుల‌భత‌ర విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చామ‌న్నారు. ఇప్ప‌టికే 5469 ఇండ‌స్ట్రియ‌ల్ యూనిట్స్‌కి అనుమ‌తులు ఇచ్చామ‌ని పేర్కొన్నారు. ఈ స‌ద‌స్సులో ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు త‌మ‌ ఆలోచ‌న‌లు పంచుకుంటార‌ని తెలిపారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బిర్యానీకి హైద‌రాబాద్ పుట్టినిల్లులాంటిదని అన్నారు. 

More Telugu News