Narendra Modi: ప్రపంచంలోనే అతిపెద్ద పెన్సిల్ స్కెచ్ వేసి ప్రధానికి బహూకరించిన ఆర్టిస్టు!

  • ప్రపంచంలోనే అతిపెద్ద కలర్ పెన్సిల్ స్కెచ్
  • గుజరాతీ ఆర్టిస్టు మనోజ్ సోనీ సృష్టి 
  • 5 నెలల శ్రమతో మోదీ ముఖచిత్రం

ప్రపంచంలోనే అతిపెద్ద పెన్సిల్ స్కెచ్ ను ప్రధాని నరేంద్ర మోదీకి గుజరాత్ కు చెందిన ఆర్టిస్టు మనోజ్ సోనీ ఈ ఉదయం బహుమతిగా అందజేశాడు. 5 నెలల పాటు శ్రమించి, కలర్ పెన్సిల్స్ వాడి 80 అడుగుల మోదీ ముఖచిత్రాన్ని మనోజ్ సోనీ చిత్రీకరించాడు. ఈ విషయం తెలియజేస్తూ ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. గుజరాత్ ఎన్నికలు, హైదరాబాదు మెట్రో ప్రారంభోత్సవం, గ్లోబల్ సమ్మిట్ తదితరాలతో బిజీగా ఉన్న మోదీ, మనోజ్ సోనీ కోసం సమయం కేటాయించడం విశేషం. ఈ స్కెచ్ ను కానుకగా అందుకున్న మోదీ ఆర్టిస్టు మనోజ్‌ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 

More Telugu News