araku vally: చంపేస్తున్న చలిపులి... ఏపీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలు

  • అరకు లోయలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
  • మిగతా ప్రాంతాల్లో 7 నుంచి 18 డిగ్రీలకు
  • మరింతగా తగ్గవచ్చంటున్న వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాలను చలిపులి చంపేస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయులకు చేరాయి. ముఖ్యంగా విశాఖ మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. మోదకొండమ్మ పాదాలులో అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగి, మినుములూరులో 8 డిగ్రీలు, చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 10 డిగ్రీలు, అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలోని మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 12 నుంచి 18 డిగ్రీలకు చేరింది. హైదరాబాద్ లో 17 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరగా, రామగుండం, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో 14 నుంచి 16 డిగ్రీల మధ్యలో వుంది. సమీప భవిష్యత్తులో ఉష్ణోగ్రత మరింతగా తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News