Urvashi Rautela: రూ.55 లక్షల చీర, రూ.28 లక్షల నగలు ధరించి.. కజిన్ పెళ్లికి వెళ్లడానికి రెడీ అవుతున్న బాలీవుడ్ నటి!

  • భారత్ తరపున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న ఊర్వశి రౌతేలా
  • ‘సనమ్‌ రే’, ‘గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ’ ‘కాబిల్‌’ వంటి సినిమాల్లో నటన
  • కజిన్ పెళ్లిలో అందర్నీ ఆకర్షించే ప్రయత్నం 

‘సనమ్‌ రే’, ‘గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ’ ‘కాబిల్‌’ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి, 2015 మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన ఉర్వశీ రౌతేలా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఫ్యాషన్ ఇండస్ట్రీ అయింది. ఆమె కజిన్‌ వివాహం డిసెంబర్ లో ఉత్తరాఖండ్ వేదికగా జరగనుంది. ఈ వివాహం సందర్భంగా తాను ధరించే చీరను ఫరాజ్ మనన్ తో ఊర్వశి డిజైన్ చేయించుకుంది.

ఈ చీరను 55 లక్షల ధరతో 40 కేజీల బరువుతో తయారు చేశారు. ఈ చీరకు మ్యాచింగ్ గా 28 లక్షల రూపాయల విలువైన నగలు కూడా ఆర్డర్ చేసింది. దీంతో ఈ పెళ్లిలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది. మోడల్ గా కెరీర్ ఆరంభించిన ఊర్వశి 2015లో ప్ర‌పంచ సుంద‌రి పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో 'మిస్ దివా' టైటిల్ గెలుచుకుంది. అనంతరం 'లవ్ డోస్' ఆల్బంతో నటించి పేరు తెచ్చుకుంది. తరువాత పలు సినిమాల ఆఫర్లు ఆమెకు వచ్చాయి. 

  • Loading...

More Telugu News