shivabalaji: అప్పట్లో ఓసారి కాలేజ్ నుంచి నన్ను సస్పెండ్ చేశారు: శివబాలాజీ

  • కాలేజ్ రోజుల్లో రఫ్ అండ్ టఫ్ గా కనిపించేవాడిని 
  • గొడవల్లో ఎక్కువగా ఉండేవాడిని
  • అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గెక్కువ      

ఒక వైపున హీరోగా చేస్తూ .. మరో వైపున ముఖ్యమైన పాత్రలను చేస్తూ శివబాలాజీ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక నిర్మాతగాను ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో వున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తన కాలేజ్ డేస్ గురించిన కొన్ని విషయాలను పంచుకున్నాడు.

" కాలేజ్ రోజుల్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గు ఎక్కువ. అమ్మాయిలు నాతో చనువుగా ఉండటానికి ప్రయత్నించేవాళ్లు. కానీ నేను అబ్బాయిలతో కలిసి మొరటుగా .. రఫ్ అండ్ టఫ్ గానే కనిపించేవాడిని. గొడవల్లో ఎక్కువగా ఉండటం వలన నాపై ఫిర్యాదులు కూడా చేసేవాళ్లు. అందువలన ఒకసారి నన్ను కాలేజ్ నుంచి ఒక వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. అప్పుడు కాదు గానీ .. ఆ తరువాత అమ్మకి ఈ విషయం తెలిసింది. ఒక వైఫున ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ .. గేమ్స్ లో పాల్గొంటూ సరదాగా ఉంటూనే, మరో వైపున మా బిజినెస్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుండేవాడిని" అంటూ చెప్పుకొచ్చాడు.     

  • Loading...

More Telugu News