Chandrababu: గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇదే!

షార్ట్స్‌లో చూడండి
వైకాపా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెను సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు, పచ్చకండువాను కప్పారు. అభివృద్ధికి దూరంగా ఉన్న పాడేరు నియోజకవర్గానికి మరిన్ని నిధులను కేటాయించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని తెలిపారు. కాగా, 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.
Go Back to Shorts
Chandrababu
giddi eshwari

More Telugu News