sai dharam tej: చరణ్ .. బన్నీ .. వరుణ్ తేజ్ ల గురించి సాయిధరమ్ తేజ్

  • అల్లు అర్జున్ చాలా కష్టపడతాడు 
  • చరణ్ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటాడు 
  • వరుణ్ సున్నితమైన కథలను ఎంచుకుంటాడు   
"చరణ్ .. వరుణ్ .. అల్లు అర్జున్ .. ఈ ముగ్గురిలో నుంచి ఒక్కో మంచి క్వాలిటీ తీసుకోవాలనుకుంటే, మీరేం తీసుకుంటారు?" అనే ప్రశ్న తాజాగా ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ కి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. "అల్లు అర్జున్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ప్రతి సినిమా విషయంలోను ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు .. ఎంతగానో కష్టపడతాడు"

"చరణ్ విషయానికి వస్తే .. తన తండ్రి ఇమేజ్ కి ఎలాంటి భంగం కలగనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుని .. దానిని కాపాడుకోవడం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే .. సున్నితంగా మనసును తాకే కథలను ఎంచుకుంటూ వుంటాడు. 'కంచె' .. 'ఫిదా' వంటి సినిమాలు ఆ కోవకి చెందినవే" అన్నారు. ఇక తన సోదరుడి సినీరంగ ప్రవేశం గురించిన ప్రశ్నకి స్పందిస్తూ .. "ఈ విషయమై ఇంకా ఏమీ అనుకోలేదు. తనకు ఇంట్రెస్ట్ వుంటే వస్తాడు . . లేదంటే లేదు" అని స్పష్టం చేశాడు.    
sai dharam tej
charan
allu arjun
varun

More Telugu News