India: కోహ్లీ సెంచరీ... తిరుగులేని ఆధిక్యానికి భారత్

  • సెంచరీ సాధించిన కోహ్లీ
  • భారత స్కోరు 377/2
  • ఇండియా అధీనంలోకి రెండో టెస్టు
నాగపూర్ లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజున కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా మరో ఎండ్ లో పాతుకుపోయిన పుజారా 136 పరుగుల వద్ద తన ఆటను కొనసాగిస్తూ ఉండటంతో, ఈ టెస్టును ఇప్పటికే తన అధీనంలోకి తెచ్చేసుకున్న టీమిండియా, ఇక తిరుగులేని ఆధిక్యం దిశగా పరుగులు తీస్తోంది.

 తొలి ఇన్నింగ్స్ లో లంకేయులు 205 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియా 373 పరుగులను కేవలం రెండు వికెట్ల నష్టానికే సాధించడంతో, లంక జట్టు కష్టాల్లో పడ్డట్టే. మరో రెండు రోజులు ఆట మిగిలుండగా, ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపును అడ్డుకోవడం ప్రస్తుతానికి శ్రీలంకకు కష్టసాధ్యమే. ప్రస్తుతం భారత స్కోరు 120 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 377 పరుగులు కాగా, పుజారా 138, కోహ్లీ 102 పరుగులతో క్రీజులో ఉన్నారు.
India
Sri Lanka
Cricket
nagapur

More Telugu News