Pakistan: ఇండియా సహకారంతో రెచ్చిపోతున్న పాకిస్థానీలు: పాక్ మంత్రి

  • ఇండియా నుంచి వచ్చిన సూచనలతో మరింత అల్లర్లు
  • సైన్యంపై దాడులకు దిగుతున్న జాతి వ్యతిరేక శక్తులు
  • 'డాన్' పత్రికలో పాక్ అంతర్గత శాఖ మంత్రి

ఇస్లామాబాద్ లో జరుగుతున్న అల్లర్ల వెనుక భారత హస్తముందని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఆరోపించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారు ఇండియాతో మాట్లాడారని, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతోనే నిరసనకారులు రెచ్చిపోయారని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందని 'డాన్' దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.

ఉగ్రవాది హఫీజ్ సయీద్ విడుదల తరువాత పాక్ లో అశాంతి పెరిగిన సంగతి తెలిసిందే. భారత్ సహా అమెరికా సైతం హఫీజ్ విడుదలను ఖండించి, అతన్ని తిరిగి అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కాగా, పాకిస్థాన్ లోని సామాన్య పౌరులెవరూ నిరసనల్లో పాల్గొనడం లేదని, ఇండియా ప్రోద్బలంతో, జాతి వ్యతిరేక శక్తులే ఈ విధ్వంసానికి పాల్పడుతున్నాయని ఇక్బాల్ ఆరోపించారు.

పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సైనిక దళాలపై నిరసనకారులు టియర్ గ్యాస్ ను ప్రయోగిస్తున్నాయని అన్నారు. నిరసనలను చిత్రీకరిస్తున్న కెమెరాల వైర్లను సైతం తెంపివేశారని అన్నారు. ఈ ఘర్షణల్లో 137 మంది సైనికులకు గాయాలు అయ్యాయని అన్నారు.

More Telugu News