sushma swaraj: అల్లా తరువాత నువ్వే మా ఆఖరి దిక్కు: సుష్మా స్వరాజ్ తో పాకిస్థాన్ బాలుడు

  • లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం మెడికల్ వీసా కోరిన బాలుడు
  • వెంటనే స్పందించి మంజూరు చేయించిన సుష్మ
  • ఇరు దేశాల మధ్య వివాదాలున్నా ఇలాంటి వాటికి అడ్డు రావన్న మంత్రి  

ప్రాణాంకత వ్యాధితో బాధపడుతూ, ఇండియాకు వచ్చి చికిత్స తీసుకోవాలని భావించిన మరో పాకిస్థానీ బాలుడికి, మెడికల్ వీసాను ఇవ్వాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నిర్ణయించారు. తమకు అల్లా తరువాత మీరే దిక్కంటూ ఓ బాలుడు చేసిన ట్వీట్ ఆమెను కదిలించింది. "అల్లా తరువాత మాకు చివరి దిక్కు మీరే. దయచేసి మాకు మెడికల్ వీసాను ఇచ్చేలా ఇస్లామాబాద్ ఎంబసీ (పాక్ లోని భారత హై కమిషన్)ని ఆదేశించండి" అని తన కజిన్ కు అత్యవసర లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయాల్సి వుందని షాజైబ్ ఇక్బాల్ కోరగా, సుష్మ వెంటనే స్పందించారు.

మానవతాంశాలను కూడా సుష్మ రాజకీయం చేస్తున్నారని పాక్ ప్రభుత్వం విమర్శించిన రోజుల వ్యవధిలోనే ఇలా ట్వీట్ రావడం, సుష్మ స్పందించడం గమనార్హం. వైద్య పరమైన చికిత్స అవసరమైన వారికి మెడికల్ వీసాలు ఇచ్చేందుకు తాము వెనుకాడబోమని ఈ సందర్భంగా సుష్మ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఎన్ని వివాదాలున్నా, వైద్య పరమైన అవసరాలకు అవేమీ అడ్డుకాదని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News