monkey: విద్యార్థి వెంట ప‌డ్డ కోతులు.. గోడకు బ‌లంగా గుద్దుకుని విద్యార్థి మృతి!

  • ప్ర‌కాశం జిల్లా పామూరు ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలో విషాదం
  • కాలేజీలో కోతుల‌ స్వైర విహారం
  • కోతుల బారినుంచి త‌ప్పించుకోబోతుండ‌గా ఘ‌ట‌న‌

కోతుల కార‌ణంగా ఓ విద్యార్థి త‌న ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌ ప్ర‌కాశం జిల్లా పామూరు ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలో చోటు చేసుకుంది. కోతులు త‌న వెంట ప‌డ‌డంతో ప్ర‌మాద‌వ‌శాత్తు ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌ర విద్యార్థి మృతి చెందాడు.

ఇటీవలి కాలంలో ఆ కాలేజీలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. విద్యార్థుల వెంట ప‌డుతూ భ‌య‌పెడుతున్నాయి. కోతుల నుంచి త‌ప్పించుకోబోయిన ఓ విద్యార్థి ఒక్క‌సారిగా గోడకు బ‌లంగా గుద్దుకుని, త‌ల ప‌గిలి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఊహించ‌ని విషాద ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో విద్యార్థులంతా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.  

  • Loading...

More Telugu News