ashes: యాషెస్ చూడ‌టం కోసం.. రోడ్డు మార్గాన 21 దేశాలు దాటి వ‌చ్చిన యువ‌కుడు!

  • కేన్స‌ర్ వ్యాధిగ్ర‌స్తుల కోసం విరాళాలు సేక‌రిస్తున్న ఇంగ్లాండ్ వ్య‌క్తి
  • మూడు నెల‌ల పాటు సాగిన మిల్ల‌ర్ ప్ర‌యాణం
  • దారిలో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ దేశాల‌ మధ్య జ‌రిగే యాషెస్ సీరీస్ చాలా ప్రతిష్ఠాత్మ‌క‌మైంది. దీన్ని చూడ‌డానికి ఇంగ్లాండ్‌కి చెందిన ఓ యువ‌కుడు 21 దేశాలు రోడ్డు మార్గాన మూడు నెల‌ల పాటు ప్ర‌యాణించాడంటే, యాషెస్ ప్రాముఖ్య‌త అర్థం చేసుకోవ‌చ్చు. ఈ సాహ‌సం చేసింది ఎవ‌రో తెలుసా? ఇంగ్లాడ్‌కి చెందిన ఎడ్‌ మిల్లర్‌.

కేన్స‌ర్ వ్యాధిగ్ర‌స్తుల చికిత్స కోసం ‘ద ఆడ్‌బాల్స్‌ ఫౌండేషన్‌’ సంస్థకు విరాళాలు సేక‌రించి ఇవ్వ‌డం కోస‌మే మిల్ల‌ర్ ఈ సాహ‌సం చేశాడు. ఇందుకోసం టీచర్‌ ఉద్యోగానికి విరామం తీసుకుని, ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ ప్ర‌ణాళిక కార‌ణంగానే మూడు నెల‌ల ముందు బ‌య‌ల్దేరి బెల్జియం, లక్సమ్‌బర్గ్‌, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, స్లోవేనియా, హంగేరీ, చెక్‌ రిపబ్లిక్‌, పోలండ్‌, ఉక్రెయిన్‌, రష్యా, మంగోలియా, చైనా, హాంకాంగ్‌, వియత్నాం, లావోస్‌, కాంబోడియా, థాయ్‌లాండ్‌, మలేసియా, సింగపూర్‌, ఇండోనేషియా దేశాలు దాటి గురువారానికి ఆస్ట్రేలియాలోని గ‌బ్బా ప్రాంతానికి చేరుకోగ‌లిగాడు.

త‌న ఈ ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురైన‌ట్లు మిల్ల‌ర్ పేర్కొన్నాడు. డార్విన్‌ నుంచి బ్రిస్బేన్‌ రావడానికి బడ్జెట్ స‌రిపోలేద‌ని, దీంతో త‌ను చేప‌ట్టిన కార్యం తెలుసుకుని, రోజుకు 10 డాలర్ల అద్దెతో ఓ అమ్మాయి కారు ఇచ్చింది తెలిపాడు. ప్ర‌యాణంలో భాగంగా కొంత మంది వ‌ద్ద విరాళాలు కూడా సేక‌రించిన‌ట్లు మిల్ల‌ర్ చెప్పాడు. అంతేకాదు... ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ గెలుస్తుంద‌ని, జానీ బెయిర్ స్టో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలుస్తాడ‌ని జోస్యం కూడా చెప్పాడు.

  • Loading...

More Telugu News