Sanskrit: సినీ ప్రియుల మనసులు కొల్లగొట్టిన తొలి సంస్కృత త్రీడీ సినిమా!

  • ఇఫీలో ప్రదర్శితమైన ‘అనురక్తి’
  • పంజాబీ నృత్యకారిణి వసుధ జీవిత కథ ఆధారంగా నిర్మితం
  • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు

అశోకన్ పీకే దర్శకత్వంలో రూపొందించిన ప్రపంచంలోనే తొలి సంస్కృత త్రీడీ సినిమా ‘అనురక్తి’ సినీ అభిమానుల మనసులు దోచుకుంది. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ సినిమా ఫిల్మ్ గోయర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. రూ.28 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా నిడివి 80 నిమిషాలు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పంజాబీ నృత్యకారిణి వసుధ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పరమేశ్వరన్ చక్కియార్ వద్ద ‘కూడియాట్టం’ నేర్చుకునేందుకు ఆమె పంజాబ్ నుంచి కేరళ వస్తారు. పరమేశ్వరన్ కుమారుడితో ప్రేమలో పడడంతో కథ మలుపు తిరుగుతుంది. అయితే ఆమె తన తండ్రితో కూడా ప్రేమలో పడిందేమోనని కుమారుడికి అనుమానం. ఇలా కథ అనేక మలుపులు తిరుగుతుంది. 2 వేల ఏళ్ల చరిత్ర కలిగిన కూడియాట్టం నృత్యం గురించి ఎన్నో తెలియని విషయాలను ఈ సినిమా చెబుతుంది.

More Telugu News