sunburn party: కాలేజీ నుంచి నేరుగా సన్ బర్న్ పార్టీకి వచ్చేసిన విద్యార్థులు!

  • సన్ బర్న్ పార్టీకి నేరుగా కళాశాల నుంచి బ్యాగులతో వెళ్లిన విద్యార్థులు
  • పార్టీ వేదిక బయట మద్యం తాగుతూ.. తూలుతూ కనిపించిన యువత  
  • రాత్రి పదిగంటలకు ముగిసిన సన్ బర్న్ పార్టీ
హైదరాబాదులో నిన్న సాయంత్రం జరిగిన సన్ బర్న్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సన్ బర్న్ పార్టీ లాంటివే నాగరికతకి (సివిలైజ్డ్ సొసైటీకి) చిహ్నమని భావిస్తే... అలాంటి సొసైటీ హైదరాబాదుకి అవసరమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సన్ బర్న్ పార్టీకి మైనారిటీ తీరని యువకులు పలువురు నేరుగా కళాశాల నుంచి బ్యాగులు పట్టుకుని చేరుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేదిక ప్రాంగణం బయట కూడా యువతీ యువకులు మద్యం సేవించినట్టు వార్తలొచ్చాయి.

రాత్రి 10 గంటలకు సన్ బర్న్ ఈవెంట్ పూర్తైనా యువతీయువకులు మాత్రం రోడ్లపై మద్యం మత్తులో తూలుతూ కనిపించారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కల్చర్ లో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పార్టీలకు అనుమతి ఇవ్వడం ద్వారా యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గోవా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన సన్ బర్న్ పార్టీకి అనుమతి ఇవ్వడం వెనుక పనిచేసిన వారు ఎవరని వారు అడుగుతున్నారు.
sunburn party
sunburn festival
Hyderabad

More Telugu News