mamatha benarjee: వారు నిషేధం విధిస్తే ఏంటీ?.. మా రాష్ట్రంలో విడుద‌ల చేసుకోండి!: 'ప‌ద్మావ‌తి' సినిమాను ఆహ్వానించిన మ‌మ‌తా బెన‌ర్జీ

  • ప‌ద్మావ‌తి సినిమాను నిషేధిస్తామ‌న్న ప‌లు రాష్ట్రాల సీఎంలు
  • ప‌ద్మావ‌తి యూనిట్‌ను ఆహ్వానించిన ప‌శ్చిమ బెంగాల్ సీఎం
  • ఈ సినిమా విడుదలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం
  • ఇందుకు మా రాష్ట్రం గర్వపడుతోంది.. సంతోషిస్తోంది

వివాదాల సుడి గుండంలో చిక్కుకున్న బాలీవుడ్ సినిమా 'ప‌ద్మావతి' విడుద‌ల వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌మ రాష్ట్రంలో ఈ సినిమాపై నిషేధం విధిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే, ఇటీవ‌ల ఈ వివాదంపై స్పందించిన‌ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వివాదం చెల‌రేగ‌డం దురదృష్టకరమని, భావ ప్రకటనా స్వేచ్ఛను నాశనం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ కంకణం కట్టుకుంద‌ని వ్యాఖ్యానించారు. ఈ సినిమాపై తాజాగా మ‌రోసారి స్పందించిన మ‌మ‌తా బెనర్జీ ఈ సినిమాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

పద్మావతి దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతో పాటు ఆ సినిమా బృందాన్ని  త‌మ రాష్ట్రానికి ఆహ్వానించారు. ఈ సినిమాను పలు రాష్ట్రాలు నిషేధిస్తున్న నేపథ్యంలో తాము మాత్రం సాదరంగా స్వాగతిస్తామని, తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ప్ర‌క‌ట‌న చేశారు. ఇందుకు త‌మ రాష్ట్రం గర్వపడుతుందని, సంతోషిస్తుందని వ్యాఖ్యానించారు.

More Telugu News