rajeev kanakala: ఎవరికీ ఫోన్లు చేసి టచ్ లో ఉండను.. అదే లోపమనుకుంటున్నాను!: రాజీవ్ కనకాల

  • ఫోన్లు చేసి టచ్ లో ఉండటం చేయను
  • స్నేహాన్ని .. ప్రొఫెషన్ ను వేరుగా చూస్తాను 
  • వాస్తవాన్ని ఎప్పుడో గ్రహించాను 
  • కానీ ఇక మారడం ఇష్టం లేదు    
రాజీవ్ కనకాల మంచి నటుడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆశించిన స్థాయిలో ఆయనకి మంచి పాత్రలు .. గుర్తింపు రాలేదనే చెప్పాలి. అందుకు గల కారణమేమిటనే ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. ''ఉదయం .. సాయంత్రం ఫోన్ చేసి ఎలా వున్నారు? .. ఏం చేస్తున్నారు? అంటూ రెగ్యులర్ గా టచ్ లో ఉండకపోవడం కారణం కావొచ్చు. నేను ఆ విధంగా చేయను కాబట్టి .. అదొక లోపంగానే చెప్పుకోవాలి"

"ఫ్రెండ్స్ అందరితోనూ కలుస్తాను .. వాళ్లతో కలిసి సరదాగా గడుపుతాను. ఆ సమయంలో సినిమాల ప్రస్తావన తీసుకురాను .. అది చేస్తాను .. ఇది చేస్తాను అని అడగను. ఎందుకంటే స్నేహాన్ని .. ప్రొఫెషన్ ను వేరు వేరుగానే చూస్తాను. అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడానికి కారణం ఇదని చాలాకాలం క్రితమే గ్రహించాను. కానీ ఆత్మను చంపుకోవడం ఇష్టం లేక .. ఫరవాలేదులే ఇంతకాలం నడిపించాం .. ఇంకొంతకాలం నడిపించలేమా అనుకుంటాను" అంటూ సమాధానమిచ్చారు.     
rajeev kanakala

More Telugu News