bihar: కట్నం తీసుకోనందుకు ఇంటికొచ్చి మరీ అభినందనలు చెప్పిన బిహార్ ముఖ్యమంత్రి!

  • కట్నం తీసుకోకుండా యువకుడి ఆదర్శ వివాహం 
  • బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రోత్సాహం
  • యువ దంపతులకు సర్ ప్రైజ్ ఇచ్చిన సీఎం
రూపాయి కూడా కట్నం తీసుకోకుండా, పైగా ఇతర మతానికి చెందిన అమ్మాయిని ఆదర్శ వివాహం చేసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రే నేరుగా ఇంటికొచ్చి అభినందించారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బిహార్ ముఖ్యమంత్రి  నితీశ్ కుమార్ వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు గతంలో పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో పాట్నాకు చెందిన సంజిత్ కుమార్, జూహి అనే యువతిని కట్నం లేకుండా ఈ నెల 19న మతాంతర వివాహం చేసుకున్నారని సీఎం దృష్టికి వచ్చింది. దీంతో నితీశ్ కుమార్ తీరిక చేసుకుని నేరుగా సంజిత్ కుమార్, జూహి ఇంటికి వెళ్లారు. పుష్పగుచ్చాలను అందించి వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఇతరులు కూడా వీరి బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
bihar
nitish kumar
cm
no dowry

More Telugu News