padmavathi: సిమి గరేవాల్ మధ్యవర్తిత్వం సఫలం... సంజయ్ లీలా భన్సాలీతో చర్చలకు రాణి పద్మినీదేవి అంగీకారం!

  • 'పద్మావతి' సినిమాపై మహారాణి పద్మినీ దేవి అభ్యంతరాలను తెలుసుకున్న సిమి గరేవాల్
  • 'ఘామర్' పాటలో పద్మావతి డాన్స్ చేయడంపై అభ్యంతరం
  • సంజయ్ లీలా భన్సాలీతో చర్చలకు సుముఖం
'పద్మావతి' సినిమా వివాదంపై ప్రముఖ సినీ నటి, టాక్ షో వ్యాఖ్యాత సిమి గరేవాల్ నిర్వహించిన మధ్యవర్తిత్వం సత్ఫలితం ఇచ్చింది. జైపూర్ లో మహారాణి పద్మినీ దేవితో సిమి గరేవాల్ సమావేశమయ్యారు. 'పద్మావతి' సినిమాపై ఉన్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు.

తమకు సినిమా పట్ల వ్యతిరేకత లేదని, సినిమాలోని 'ఘామర్' పాటలో 'పద్మావతి' పాత్రధారి డాన్స్ చేయడం పట్ల మాత్రమే విముఖంగా ఉన్నామని తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో సంజయ్ లీలా భన్సాలీతో చర్చించేందుకు తాను ఏర్పాట్లు చేస్తానని ఆమె ప్రతిపాదించగా, రాణి పద్మినీ దేవి అంగీకరించారు. దీంతో వివాదం కాస్త సద్దుమణిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
padmavathi
movie
controversy
sunjay leela bhansali
padmini devi
simi gerewal

More Telugu News