డోక్లాంలో కలకలం... రోడ్లు, సొరంగాలు, గోడ నిర్మించిన చైనా.. అప్రమత్తమైన భారత్!
- సొరంగాలు, బ్యారక్‌లు నిర్మిస్తున్న చైనా
- రోడ్లు, మౌలిక సదుపాయాలపై భారత్ దృష్టి
- భారీ యంత్రాలను తరలించిన భారత్
దీంతో భారత్ కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ‘కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ (సీవోఈ)’ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆధునిక భారీ యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. సీవోఈకి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) సిబ్బంది సాయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్వోను బలోపేతం చేయడం ద్వారా పనుల్లో వేగం పెంచాలని భావిస్తోంది.