check books: చెక్‌బుక్‌ల‌ను ర‌ద్దు చేసే యోచన లేదు.. ఇదంతా దుష్ప్రచారమే!: ప్ర‌భుత్వం వివరణ

  • మా వ‌ద్ద అటువంటి ప్ర‌తిపాద‌న ఏదీ లేదు
  • ఆ వార్త‌ల‌ను ఖండిస్తున్నాం
  • కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌

ఇటీవల వ్యాపారుల సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్ చెక్‌బుక్‌ల రద్దు అంటూ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. న‌గ‌దు ర‌హిత లావాదేవీలను ప్రోత్స‌హించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చని అంద‌రూ భావించారు. ఈ విష‌యంపై అంద‌రిలోనూ చ‌ర్చ జ‌రుగుతోన్న నేప‌థ్యంలో కేంద్ర‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ... చెక్‌బుక్‌లను రద్దు చేసే యోచన లేద‌ని స్ప‌ష్టం చేసింది. న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ ప్రోత్సాహంలో భాగంగా త్వర‌లోనే చెక్‌బుక్‌లను ర‌ద్దు చేస్తున్నారంటూ ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేసిందని, దీన్ని ఖండిస్తున్నామ‌ని తెలిపింది. అస‌లు ప్ర‌భుత్వం వ‌ద్ద ఈ ప్రతిపాదన ఏదీ లేద‌ని తేల్చి చెప్పింది.   

More Telugu News