Jagan: రైతుల ఆత్మహత్యాయత్నం ఘటనపై చలించిపోయిన జగన్.. ఒక్క ఏడాది ఆగాలంటూ విన్నపం!

  • రైతులకు ఫోన్ చేసిన జగన్
  • వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి న్యాయం చేస్తానంటూ హామీ
  • కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర

విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగిస్తున్న ఆయన బాధిత రైతులకు ఫోన్ చేసి, వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఆత్మహత్యలకు పాల్పడరాదని, ధైర్యంగా ఉండాలని సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి రూ. 2.30 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు కూడా ఇదే విషయాన్ని చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం వారిని వేధింపులకు గురి చేస్తోందని చెప్పారు. మరో ఏడాది ఆగాలని... తాము అధికారంలోకి రాగానే రైతులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. 

More Telugu News