Virat Kohli: బీసీసీఐపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విరాట్‌ కోహ్లీ

  • ఒకదాని వెనుక మ‌రో సిరీస్‌ నిర్వ‌హించ‌డంపై అభ్యంత‌రం
  • విశ్రాంతి ఇవ్వ‌డం లేద‌ని ఆవేద‌న‌
  • ఆట‌లో పాల్గొనడం తప్ప మరో గత్యంతరం లేదు
  • ఇలాగైతే ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డుతుంది

బీసీసీఐపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. విశ్రాంతి లేకుండా ఒకదాని వెనుక మ‌రో సిరీస్‌ను నిర్వ‌హించ‌డంపై అభ్యంత‌రం తెలిపాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న‌ శ్రీలంక-భార‌త్‌ సిరీస్ ముగిసిన వెంటనే ద‌క్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ... ఈ సిరీస్‌ ముగిసిన త‌రువాత‌ దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు త‌మ‌కు రెండు రోజుల సమయం మాత్రమే ఉంద‌ని అన్నాడు.

త‌మ‌కు ఆట‌లో పాల్గొనడం తప్ప మరో గత్యంతరం లేదని, త‌మ‌కు ఒక నెల గడువు దొరికినట్టయితే, తాము సరిగ్గా ద‌క్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమై ఉండేవాళ్లమ‌ని చెప్పాడు. ఇలా వరుసగా సిరీస్‌లు ఆడితే త‌మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అన్నాడు. సిరీస్‌లు ఆడడంలో సరైన ప్లానింగ్ ఉండాల‌ని వ్యాఖ్యానించాడు.        

More Telugu News