శ్రీనగర్ ఆర్మీ పాఠ‌శాల విద్యార్థులకు స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన ధోని!

23-11-2017 Thu 14:11
  • గౌర‌వ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ హోదాలో పాఠ‌శాల‌కు వెళ్లిన ధోని
  • క్రీడ‌లు, చదువు రెండూ ముఖ్య‌మేనంటూ ప్ర‌సంగం
  • ట్విట్ట‌ర్‌లో ఫొటోలు

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ, శ్రీన‌గ‌ర్‌లోని ఆర్మీ పాఠ‌శాల విద్యార్థుల‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా ధోనీ పాఠశాల‌కు వెళ్లి పిల్ల‌ల‌తో ముచ్చ‌టించాడు. భార‌త ఆర్మీలో గౌర‌వ‌ప్ర‌ద లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ హోదాలో ధోనీ పాఠశాల‌ను సంద‌ర్శించాడు. అక్కడి విద్యార్థులకు క్రీడలు, చదువు ప్రాముఖ్యతలను చెబుతూ, ఆ రెండింటిని స‌మన్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్ర‌సంగం ఇచ్చారు. ఈ సంద‌ర్శ‌నకు సంబంధించి భార‌త ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఫొటోలు పెట్టారు.