sai dharam tej: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'జవాన్' ట్రైలర్!

  • లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి పెద్దపీట
  • ఆకట్టుకునే డైలాగ్స్
  • సాయిధరమ్ తేజ్ యాక్షన్ హైలైట్   
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దిల్ రాజు సమర్పణలో 'జవాన్' చిత్రం తెరకెక్కింది. తేజు అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా, వచ్చేనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్, ఆసక్తిని రేకెత్తించేలా వుంది.

 "యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా .. వెనకోడు ఆగిపోయాడా .. ముందోడు కూలిపోయాడా కాదురా .. యుద్ధం గెలిచామా? లేదా? అన్నదే ముఖ్యం" అంటూ విలన్ తో సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుందనిపిస్తోంది. దేశ ద్రోహుల కార్యకలాపాలకు అడ్డుగా నిలుస్తూ .. వాళ్ల బారి నుంచి ఒక వైపున తన కుటుంబాన్ని .. మరో వైపున తన దేశాన్ని కాపాడుకునే యువకుడిగా ఈ ట్రైలర్ లో సాయిధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు. మొత్తం మీద ఈ ట్రైలర్ .. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
sai dharam tej
mehreen

More Telugu News