agra university: ఆగ్రా యూనివర్సిటీ నిర్వాకం.. 35% మార్కులతో డిగ్రీ ఫస్టియర్ పాసైన సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ!

  • డిగ్రీ పరీక్షలు నిర్వహించిన ఆగ్రా యూనివర్సిటీ అనుబంధ విద్యాలయం 
  • విద్యార్థులకు మార్కుల జాబితా విడుదల 
  • తమ ఫొటోకు బదులు సల్మాన్, రాహుల్ ఫోటోలు ఉండడంతో విద్యార్థుల షాక్

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కేవలం 35 శాతం మార్కులతో డిగ్రీ మొదటి సంవత్సరం పాసయ్యాడు. అయితే, సల్మాన్ ఇప్పుడు చదవడమేంటన్న అనుమానం వచ్చిందా? అయితే ఇది చదవండి... ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా యూనివర్సిటీ అనుబంధ విద్యాలయం అమ్రితా సింగ్‌ మెమోరియల్‌ డిగ్రీ కళాశాలకు చెందిన ఒక విద్యార్థి బీఏ మొదటి సంవత్సరం పూర్తైన సందర్భంగా పరీక్షలు రాశాడు. అనంతరం మార్కుల షీట్ ను యూనివర్సిటీ పంపించింది.

అయితే, దానిని చూసిన సదరు విద్యార్థి షాక్ తిన్నాడు. ఎందుకంటే, ఆ మార్కుల లిస్టులో తన ఫొటోకు బదులుగా సల్మాన్ ఖాన్ ఫొటో ఉంది. దీంతో వెంటనే ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దానిని సరిచేయాల్సిన అధికారగణం తప్పు తమది కాదని, మార్కుల షీటు ముద్రించిన ప్రైవేటు ఏజెన్సీదని సమాధానం చెప్పి చేతులు దులిపేసుకుంది. మరొక విద్యార్థికి రాహుల్ గాంధీ ఫొటోతో కూడిన మార్క్స్ షీటు ఇచ్చారు. ఇది మీడియాకు చేరడంతో వేగంగా స్పందించిన అధికారులు వాటిని వెనక్కి తేవాలని సిబ్బందిని ఆదేశించారు. 

  • Loading...

More Telugu News