paritala sunitha: సీఎం సీటుపై మోజుతో జ‌గ‌న్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు హామీలు ఇస్తున్నారు: ప‌రిటాల సునీత‌

  • జగన్‌ పాదయాత్ర చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
  • అర్థరహిత వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌దు
  • కోర్టులు, జైళ్ల చుట్టూ తిరగడం తప్ప ఆయన ముఖ్య‌మంత్రి కాలేరు
  • మహిళా సంఘాల సభ్యులకు మేము ఇప్పటికే ఒక్కొక్కరికీ రూ.6వేలు చెల్లించాం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి ప‌రిటాల సునీత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వం చేస్తోన్న అన్ని ప‌నుల‌ను జ‌గ‌న్ విమ‌ర్శిస్తున్నార‌ని అన్నారు. జగన్‌ పాదయాత్ర చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నార‌ని అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ మహిళా సదస్సు నిర్వహించి స‌ర్కారుని విమర్శిస్తూ మాట్లాడార‌ని అన్నారు.

ఇటువంటి అర్థరహిత వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళా సంఘాల సభ్యులకు తాము ఇప్పటికే ఒక్కొక్కరికీ రూ.6వేలు చెల్లించామని తెలిపారు. మిగతా రూ.4వేలు కూడా త్వరలోనే చెల్లిస్తామ‌ని అన్నారు.  సీఎం సీటుపై మోజుతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇష్టం వ‌చ్చిన‌ట్లు హామీలు ఇస్తున్నార‌ని ఆమె అన్నారు. కోర్టులు, జైళ్ల చుట్టూ తిరగడం తప్ప ఆయన ముఖ్య‌మంత్రి కాలేర‌ని ఎద్దేవా చేశారు.
paritala sunitha
cm
jagan
Chandrababu

More Telugu News