sangita: కొత్త కోణం.. శ్రీనివాస్ రెడ్డి నుంచి సంగీత‌ 3 కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేస్తోంది: రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌

  • ఈ విష‌యం మాకు ఈ రోజే తెలిసింది
  • చ‌ట్ట ప్ర‌కారం మేము చేసేది చేస్తాం: రాచ‌కొండ సీపీ
  • నేను డ‌బ్బు డిమాండ్ చేయడం లేదు: స‌ంగీత‌
  • కేసును నీరుగార్చాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు

హైద‌రాబాద్ శివారులోని బోడుప్ప‌ల్ వాసి, టీఆర్ఎస్ బ‌హిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు చేస్తూ ఆయ‌న భార్య ధ‌ర్నాకు దిగిన విష‌యం తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు చేస్తోన్న‌ ఆమె ధ‌ర్నా నాలుగో రోజుకి చేరుకుంది. ఈ కేసు గురించి మాట్లాడిన రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ కొత్త విష‌యాన్ని చెప్పారు. మూడుకోట్లు డిమాండ్ చేస్తూ సంగీత ధ‌ర్నా చేస్తోందని అన్నారు. త‌మ‌కు ఈ రోజే ఈ విష‌యం తెలిసింద‌ని చెప్పారు. చ‌ట్ట ప్ర‌కారం తాము చేసేది తాము చేస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే సంగీత భ‌ర్త‌ను అరెస్టు చేశామ‌ని అన్నారు.

అయితే, సంగీత మాత్రం తాను డ‌బ్బు డిమాండ్ చేయ‌డం లేద‌ని తెలిపింది. త‌న‌కు న్యాయం మాత్ర‌మే కావాల‌ని అంటోంది. తాను ఎప్పుడు డ‌బ్బు డిమాండ్ చేశానో చెప్పాల‌ని అంటోంది. త‌న కేసును నీరుగార్చాల‌నే త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, త‌న‌కు న్యాయం జరిగేవరకూ త‌న పోరాటం ఆగ‌బోద‌ని తేల్చి చెప్పింది. త‌న అత్తామామ‌ల‌కు పోలీసులు మ‌ద్ద‌తు తెలుపుతూ ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని తెలిపింది. 

  • Loading...

More Telugu News