bellamkonda srinivas: మళ్లీ వినాయక్ తోనే బెల్లంకొండ శ్రీనివాస్

  • సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ మూవీ 
  • ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ 
  • గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అల్లుడు శీను'
  • త్వరలో నే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి  

బెల్లంకొండ శ్రీనివాస్ ను 'అల్లుడు శీను' సినిమాతో తెలుగు తెరకు వినాయక్ పరిచయం చేశాడు. ఈ సినిమా శ్రీనివాస్ కి మాస్ హీరోగా క్రేజ్ ను తీసుకురావడమే కాకుండా, సక్సెస్ ను ఇచ్చింది. దాంతో మళ్లీ వినాయక్ తో చేయడానికి బెల్లంకొండ శ్రీనివాస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

 ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ .. శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. మరో వైపున సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ ఒక సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా సెట్స్ పై వుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ చేస్తోన్న ఇతర సినిమాలు పూర్తి కాగానే, వీళ్ల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసుకునే పనిలో ఉందట. ఈ సారి కూడా ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి మరి.        

  • Loading...

More Telugu News