kalyan ram: కల్యాణ్ రామ్ జోరుమీదే వున్నాడు .. రెండు సినిమాలు కానిచ్చేస్తున్నాడు

  • ఉపేంద్ర మాధవన్ దర్శకత్వంలో 'మంచి లక్షణాలున్న అబ్బాయి'
  • జయేంద్ర దర్శకత్వంలో మరో సినిమా
  • ఈ నెల 29 నుంచి జయేంద్ర సినిమా షెడ్యూల్
  • కథానాయికగా తమన్నా
నిర్మాతగా 'జై లవకుశ' సినిమాతో హిట్ కొట్టేసిన కల్యాణ్ రామ్ .. తాను హీరోగా చేస్తోన్న సినిమాలపై దృష్టి పెట్టాడు. ఒక వైపున ఉపేంద్ర మాధవన్ దర్శకత్వంలో 'మంచి లక్షణాలున్న అబ్బాయి' సినిమా చేస్తోన్న ఆయన, మరో వైపున జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'మంచి లక్షణాలున్న అబ్బాయి'లో కల్యాణ్ రామ్ జోడీగా కాజల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఓ షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది.

 దాంతో జయేంద్ర సినిమా తాజా షెడ్యూల్ షూటింగులో పాల్గొనడానికి కల్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు. ఈ నెల 29వ తేదీ నుంచి షూటింగ్ మొదలై .. వచ్చేనెల 20వ తేదీ వరకూ కొనసాగనుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కథానాయికగా తమన్నా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు తనకి హిట్ ఇస్తాయనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు. 
kalyan ram
thamannah

More Telugu News