mahesh babu: మహేశ్ తో వినాయక్ మూవీ ఖాయమైపోయినట్టే!

  • 'భరత్ అనే నేను' చేస్తోన్న మహేశ్ బాబు 
  • తన 25వ సినిమా వంశీ పైడిపల్లితో
  • తరువాత దర్శకుడు త్రివిక్రమ్ 
  • ఆ నెక్స్ట్ ప్రాజెక్టు వినాయక్ తో    
స్టార్ డైరక్టర్స్ తో పనిచేయడానికే మహేశ్ బాబు ఎక్కువ ఆసక్తిని చూపుతుంటాడు. ఒక్కోసారి ఫలితం తేడా కొట్టేసినా, ఆయన తనదైన రూట్లో ముందుకు వెళుతూనే ఉంటాడు. అలా తాజాగా ఆయన వినాయక్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

 ప్రస్తుతం కొరటాలతో 'భరత్ అనే నేను' చేస్తోన్న మహేశ్ బాబు, ఆ తరువాత తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఇక 26వ సినిమాను త్రివిక్రమ్ తో సెట్ చేసుకున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును వినాయక్ తో చేయడానికి మహేశ్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. చిరూతో చేసిన  'ఖైదీ నెంబర్ 150'తో హిట్ కొట్టేసిన వినాయక్, ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ పూర్తి స్థాయి మాస్ హీరో అనిపించుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇక మహేశ్ తో వినాయక్ చేయనున్న కథపై అందరిలో ఆసక్తి మొదలవడం ఖాయమనే చెప్పాలి.   
mahesh babu
vinayak

More Telugu News