muslims: ట్రిపుల్ తలాక్ చెబితే ఇక చిప్పకూడే.. బిల్లు తయారవుతోంది!

  • బిల్లుకు మోదీ ప్రభుత్వ రూపకల్పన
  • మంత్రుల సంఘం ఏర్పాటు
  • శీతాకాల సమావేశాల్లోనే బిల్లు

సుదీర్ఘ కాలంగా ముస్లిం మహిళల కన్నీటికి కారణమవుతున్న ట్రిపుల్‌ తలాక్‌ సంప్రదాయానికి చరమగీతం పాడే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా చెబుతోంది. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ ను చెప్పే భర్తల చేత చిప్పకూడు తినిపించేందుకు సిద్ధమవుతోంది.

 కేవలం వారిని జైలు శిక్షకు మాత్రమే పరిమితం చేయకుండా జరిమానా విధించే దిశగా కూడా చట్టాన్ని పకడ్బందీగా తయారుచేస్తోంది. ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిబంధనల రూపకల్పనకు నిపుణులను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

కొత్త బిల్లుకు రూపకల్పన చేయాలా? లేక ఇప్పుడున్న నిబంధనలనే సవరించాలా? అన్నది అధ్యయనం చేసేందుకు మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో న్యాయ, మహిళా శిశు సంక్షేమం, సామాజిక న్యాయం, మైనారిటీ వ్యవహారాల శాఖల మంత్రులను సభ్యులుగా చేసింది. ఈ సంఘం ట్రిపుల్ తలాక్ పై చర్యలు సూచించనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ శీతాకాల సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ పై స్పష్టమైన నిబంధనల బిల్లు ఆమోదం పొందనుంది. 

More Telugu News