ravi sasthri: సెంచరీకి 3 పరుగుల దూరంలో ఉన్నప్పుడు.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేందుకు సిద్ధమైన కోహ్లీ!

  • 97 పరుగుల వద్ద డిక్లేర్ చేసేందుకు సిద్ధమైన కోహ్లీ
  • డిక్లేర్ చేయవద్దన్న రవిశాస్త్రి
  • కోహ్లీ నిబద్ధతపై సర్వత్రా ప్రశంసలు

గెలవడమే తనకు ముఖ్యం... గెలుపు తర్వాతే ఏదైనా అనే విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సారి చాటి చెప్పాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ సెంచరీ (104) చేసిన సంగతి తెలిసిందే. అయితే, టెస్టును గెలవడం కోసం తన సెంచరీని పణంగా పెట్టేందుకు సైతం సిద్ధపడ్డాడు.

 చివరి రోజు ఆట కావడం, ఎక్కువ సమయం లేకపోవడంతో... 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేందుకు కూడా కోహ్లీ సిద్ధపడ్డాడు. స్టాండ్స్ లో కూర్చున్న హెడ్ కోచ్ రవిశాస్త్రిని చూస్తూ డిక్లేర్ చేయాలా? అంటూ సంజ్ఞ చేశాడు. అయితే, డిక్లేర్ చేయవద్దని, బ్యాటింగ్ కంటిన్యూ చేయాలంటూ రవిశాస్త్రి అక్కడ నుంచే సూచించాడు. దీంతో కోహ్లీ సెంచరీ పూర్తయింది. కోహ్లీకున్న నిబద్ధతపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కోహ్లీపై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ స్థాయిలో కోహ్లీ 50వ సెంచరీ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు. కోహ్లీ ప్రతిభకు ఆకాశమే హద్దని అన్నాడు. కోహ్లీకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా వ్యాఖ్యానించాడు. 

More Telugu News