pavan: 'అజ్ఞాతవాసి' ఫస్టులుక్ విడుదల తేదీ ఖరారు!

  • ఈ నెల 25న 'అజ్ఞాతవాసి' ఫస్టులుక్ 
  • వచ్చేనెల 15వ తేదీన ఆడియో రిలీజ్ 
  • జనవరి 10వ తేదీన సినిమా విడుదల

పవన్ కల్యాణ్ అభిమానులంతా 'అజ్ఞాతవాసి' సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ చకచకా సాగిపోతూ వస్తోంది. త్వరలో వారణాసిలో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. దసరా నుంచి ఈ సినిమా ఫస్టులుక్ కోసం అభిమానులంతా నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట.

ఈ నెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజున ఈ సినిమా నుంచి ఫస్టు సాంగ్ ను వదిలారు. ఆ సాంగ్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఫస్టులుక్ ద్వారా మరింతగా అంచనాలు పెంచే పనిలో ఈ సినిమా టీమ్ వుంది. అనిరుధ్ అందించిన ఆడియోను వచ్చేనెల 15వ తేదీన విడుదల చేసి, సినిమాను జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.           

More Telugu News