Allu Arjun: నా బంగారు తల్లికి శుభాకాంక్షలు: అల్లు అర్జున్

  • అల్లు అర్జున్ కుమార్తె పుట్టిన రోజు నేడు
  • గారాల పట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బన్నీ
  • అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే నమ్మలేకపోతున్నా
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎంతో ఆనందంగా ఉన్నాడు. దీనికి కారణం ఈ రోజు ఆయన గారాల పట్టి అర్హా పుట్టినరోజు కావడమే. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. 'హ్యాపీ బర్త్ డే టు మై లిటిల్ ఏంజెల్. నా బంగారు తల్లి పుట్టి అప్పుడే ఒక ఏడాది గడిచిపోయిందంటే నమ్మలేక పోతున్నా' అంటూ ట్వీట్ చేశాడు. స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ వివాహం 2011లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తొలుత కుమారుడు అయాన్ జన్మించగా, ఏడాది క్రితం అర్హా జన్మించింది.
Allu Arjun
tollywood
allu sneha reddy

More Telugu News