washing: దుస్తులు ఉతికివ్వ‌డానికో యాప్‌... ప్రాచుర్యం పొందుతోన్న హైద‌రాబాదీ స్టార్ట‌ప్‌!

  • అందుబాటులోనే ధ‌ర‌లు
  • పిక‌ప్‌, డెలివ‌రీ కూడా
  • యాప్ రూపొందించిన ధీర‌జ్ బ‌లుసాని, వినీల్ చంద్ర‌

బిజీ బిజీ లైఫ్‌లో దుస్తులు ఉతుక్కోవ‌డమ‌నేది చాలా పెద్ద ప‌ని. వాషింగ్ మెషీన్లు ఉన్న‌ప్ప‌టికీ అందులో వేయ‌డం, ఉతికే వ‌ర‌కు ఆగ‌డం, మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా ఆరేయ‌డం చాలా చాలా పెద్ద ప‌నులు. అలాగ‌ని బ‌య‌ట ఎవ‌రికైనా ఉత‌క‌డానికి వేద్దామా అంటే... వెళ్లి దుస్తులు ఇచ్చి, మ‌ళ్లీ తీసుకునే స‌మ‌యం ఉండ‌దు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ హైద్రాబాద్‌కి చెందిన ధీర‌జ్ బ‌లుసాని, వినీల్ చంద్ర రంగ‌లు ప‌రిష్కారం చూపించారు. వీరిద్ద‌రూ రూపొందించిన‌ 'వాషాప్' అనే స్మార్ట్‌ఫోన్ యాప్ రూపొందించారు. టీ-హబ్ స‌హ‌కారంతో రూపొందించిన ఈ యాప్‌ను 2016లో విడుద‌ల‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ యాప్ చాలా ప్రాచుర్యం సంపాదించుకుంది.

ఎలా పనిచేస్తుంది?
యాప్ ద్వారా గానీ, వెబ్‌సైట్ ద్వారా గానీ ముందు దుస్తులు తీసుకునే పిక‌ప్ షెడ్యూల్ చేయాలి. పిక‌ప్ చేసుకున్న దుస్తుల‌ను వాషాప్ హ‌బ్‌కి తీసుకెళ్తారు. అక్క‌డ దుస్తుల రంగు, వ‌స్త్రం తీరు ఆధారంగా విభ‌జించి, పారిశ్రామిక లాండ్రీ యంత్రాల్లో మంచి కెమిక‌ల్స్ ఉప‌యోగించి ఉతుకుతారు. త‌ర్వాత షెడ్యూల్ చేసిన డెలివ‌రీ టైమ్ ప్ర‌కారం తీసుకొచ్చి ఇస్తారు.

డ్రైక్లీనింగ్‌, సాధార‌ణ వాష్‌, ఇస్త్రీ ఇలా ఒక్కో ప‌నికి ఒక్కోవిధంగా ఛార్జీ చేస్తారు. క‌నిష్టంగా రూ. 60 నుంచి ధ‌ర‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం వీరికి నెల‌కు రూ. 4.5 ల‌క్ష‌ల రెవిన్యూ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువ‌గా నివ‌సించే గ‌చ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, కేపీహెచ్‌బీ, ప్ర‌గ‌తి న‌గ‌ర్‌, నిజాంపేట్‌, కూక‌ట్‌ప‌ల్లి ప్రాంతాల్లో ఈ యాప్ సేవ‌లందిస్తోంది.

More Telugu News