singer sunitha: ఆ ఫేస్ బుక్ అకౌంట్స్ నావి కాదు.. ఆ రాతలూ నావి కాదు: సింగర్ సునీత

  • నా పేరుతో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేశారు
  • నా పేరు, పరపతిని నాశనం చేస్తున్నారు
  • నాకు ఒక ఫేస్ బుక్ అకౌంట్ మాత్రమే ఉంది
తన పేరు మీద ఫేస్ బుక్ లో ఎవరెవరో అకౌంట్స్ ఓపెన్ చేశారని.... అలాంటి ఫేక్ ప్రొఫైల్స్ ని ఎంకరేజ్ చేయవద్దని టాలీవుడ్ సింగర్ సునీత అన్నారు. ఫేక్ అకౌంట్ల ద్వారా వారంతా వీలైనంత ఎక్కువ మందితో టచ్ లో ఉన్నారని... ఈ వ్యవహారంతో తాను చాలా అప్ సెట్ అయ్యాయని ఆమె వాపోయారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ ద్వారా కూడా వారు మెసేజింగ్, చాటింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఫేస్ బుక్ లో తనకు ఒకే అకౌంట్ ఉందని... దానికి బ్లూ కలర్ టిక్ ఉంటుందని... ఆ టిక్ ను చూసి తనను ఫాలో కావాలని సూచించారు. ఈ ఫేక్ అకౌంట్ గాళ్లంతా తన పేరును, తన పరపతిని పాడు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఫేక్ అకౌంట్లను తాను ఇక్కడ రెండింటిని పోస్ట్ చేస్తున్నానని... ఇలాంటి అకౌంట్లు చాలా ఉన్నాయని చెప్పారు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దని కోరారు.
singer sunitha
sunitha
tollywood
sunitha facebook

More Telugu News