Ravichandran Ashwin: తమ శోభనం రాత్రి నాటి సీక్రెట్ చెప్పిన అశ్విన్ భార్య ప్రీతి!

  • ఫస్ట్ నైట్ మరుసటి రోజే క్రికెట్ మ్యాచ్
  • అశ్విన్ ను పడుకోనివ్వాలని సూచించిన కుటుంబీకులు
  • స్వీట్ మెమొరీని పంచుకున్న ప్రీతి అశ్విన్
క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య, ప్రీతి తమ తొలి రాత్రికి చెందిన ఓ స్వీట్ సీక్రెట్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. సరిగ్గా ఆరేళ్ల క్రితం తమ వివాహం అయిందని చెబుతూ, తమ ఫస్ట్ నైట్ మరుసటి రోజే, మ్యాచ్‌ ఉండటంతో అశ్విన్‌ ను పడుకోనివ్వాలని కుటుంబసభ్యులు సూచించారని గుర్తు చేసుకుంది.

టీమ్‌ కు చెందిన రహస్య అలారంలు రాత్రాంతా మోగాయని, తర్వాత రోజు మేం బాటింగ్‌ చేశామంటూ సరదాగా చెప్పుకొచ్చింది. అది అశ్విన్‌ కు తొలి టెస్ట్‌ మ్యాచ్‌ అని, తొలిసారి చూసినప్పుడు మైదానంలో అశ్విన్ ను గుర్తించలేక పోయానని చెప్పిన, ప్రీతి, ఇప్పుడు ఏకంగా 300 వికెట్లు తీశాడని పేర్కొంది. ఇక ఈ లవ్లీ మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Ravichandran Ashwin
preeti
first night

More Telugu News