Flipkart: మార్కెట్‌ను షేక్ చేసేందుకు వచ్చేస్తున్న ఫ్లిప్‌కార్ట్.. అద్భుత ఫీచర్లతో సొంత స్మార్ట్‌ఫోన్ విడుదల!

  • బిలియన్ క్యాప్చర్ ప్లస్ ఫోన్‌ను విడుదల చేసిన ఫ్లిప్‌కార్ట్
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ స్టోరేజీతో వస్తున్న ఫోన్
  • రెండు వేరియంట్లలో లభ్యం

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో సంచలనం క్రియేట్ చేసేందుకు మార్కెట్లోకి దూకింది. ఇప్పటి వరకు వివిధ కంపెనీలకు చెందిన లక్షలాది ఫోన్లను వినియోగదారులకు అందించిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు సొంత స్మార్ట్‌ను విడుదల చేసింది. లక్షలాదిమంది వినియోగదారుల రివ్యూల అనంతరం దీనికి రూపకల్పన చేసి, అద్భుత ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా తయారుచేసింది. అంతేకాదు.. ఈ ఫోన్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని జోడించింది. ‘బిలియన్ క్యాప్చర్  ప్లస్’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది.

ఫీచర్లు ఇలా: 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్/32 జీబీ అంతర్గత మెమొరీ, 4జీబీ ర్యామ్/64 జీబీ అంతర్గత మొమొరీ, 2.5డీ ఆశాహి డ్రాగన్‌ ట్రయల్ గ్లాస్, వెనక ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 7.1.2 నౌగట్ ఓఎస్, అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఆండ్రాయిడ్‌ ఓరియోకు అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

ఇందులోని క్విక్‌చార్జ్ టెక్నాలజీ వల్ల కేవలం 15 నిమిషాల చార్జింగ్‌లో ఆరు గంటలపాటు ఫోన్ పనిచేస్తుంది. 13 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇక ఇందులోని క్లౌడ్  స్టోరేజీ అదనపు ఆకర్షణ. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ సదుపాయం వల్ల ఫోన్‌లోని మెమొరీ అయిపోతుందన్న బాధలేదు. అన్‌లిమిటెడ్ క్లౌడ్ స్టోరే జీ అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. కాబట్టి ఫొటోలు, వీడియోలను భద్రపరుచుకునే విషయంలో ఆందోళన అవసరం లేదు. 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999, 4 జీబీ ర్యామ్ ధర రూ. 12,999.

  • Loading...

More Telugu News