Congress: రాహుల్ ఎన్నిక ఏకగ్రీవమా? ఓటింగా?: తేల్చనున్న సీడబ్ల్యూసీ

  • రేపు సీడబ్ల్యూసీ కీలక సమావేశం
  • ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ
  • ఎన్నిక అనివార్యమైతే, రేపే షెడ్యూల్ విడుదల
  • దాదాపు ఏకగ్రీవమేనంటున్న కాంగ్రెస్ వర్గాలు

ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి పూర్తి స్థాయి పగ్గాలను అప్పగించేందుకు శరవేగంగా అడుగులు పడిపోతున్నాయి. అయితే, రాహుల్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుందా? లేక ఎవరైనా పోటీకి దిగుతారా? అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. రేపు ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక సమావేశం జరుగనుండగా, ఈ విషయంపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ ఖరారుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నిక అనివార్యమని భావించిన పక్షంలో రేపే ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేస్తామని తెలిపాయి. కాగా, రాహుల్ ఎన్నిక దాదాపు ఏకగ్రీవమేనని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పేరుకు ఎవరి నుంచీ అభ్యంతరాలు వచ్చే అవకాశం లేదని సమాచారం.

More Telugu News