school: 11వ తరగతి విద్యార్థి ప్యాంట్‌ను కత్తిరించిన స్కూల్ యాజ‌మాన్యం!

  • జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చినందుకు శిక్ష‌
  • విద్యార్థి తొడలపై తీవ్రగాయాలు
  • ఉత్తరప్రదేశ్‌ సికందర్ పుర సమీపంలోని పాఠశాల‌లో ఘ‌ట‌న‌
స్కూల్‌ యూనిఫాం వేసుకురాక‌పోతే విద్యార్థుల‌ను ఎండలో నిల‌బెట్టే టీచ‌ర్ల‌ను చూశాం.. బెత్తంతో వీపు విమానం మోత మోగించిన టీచ‌ర్ల గురించి విన్నాం.. అలా చేయ‌డ‌మే త‌ప్ప‌ని అంద‌రూ భావిస్తోంటే మ‌రోవైపు ఉత్తరప్రదేశ్‌ లోని సికందర్ పుర సమీపంలోని కాన్పూర్‌ గ్రామంలో మాత్రం ఓ పాఠ‌శాల యాజ‌మాన్యం మ‌రో కొత్త చ‌ర్య‌కు పాల్ప‌డింది.
 
స్కూల్ యూనిఫాం కాకుండా జీన్స్ ప్యాంట్ వేసుకుని వ‌చ్చాడ‌ని, 11వ తరగతి విద్యార్థి ప్యాంట్‌ను కత్తిరించారు. తొడలపై భాగం వరకు ఆ ప్యాంట్‌ను కత్తిరించే క్ర‌మంలో ఆ బాలుడి తొడలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న ఆ విద్యార్థి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.   
school
Uttar Pradesh
teachers

More Telugu News