nara brahmani: ఫేస్ బుక్ బ్లడ్ టూల్ ను ప్రారంభించాం: నారా బ్రాహ్మణి

  • ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శిబిరం
  • రక్తదానంపై విస్తృత ప్రచారం అవసరమన్న బ్రాహ్మణి
  • యువత ముందుకు రావాలంటూ పిలుపు

ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ, మన దేశంలో ఏటా 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతోందని చెప్పారు. అయితే, కేవలం రెండున్నర కోట్ల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలో, రక్తదానం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, యువత భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాలని అన్నారు. రక్తదానంపై ప్రచారం నిర్వహించేందుకు ఫేస్ బుక్ బ్లడ్ టూల్ ను ఈ రోజు ప్రారంభించినట్టు తెలిపారు. 

  • Loading...

More Telugu News