Revanth Reddy: కాంగ్రెస్ లో చేరి రేవంత్ తప్పు చేశాడు: తలసాని శ్రీనివాస్ యాదవ్
- కాంగ్రెస్ నేతలు రేవంత్ ను ఎదగనిస్తారా?
- ఇతర జిల్లాల్లో పర్యటించగలరా?
- టీడీపీలో మాట్లాడినంత స్వేచ్ఛగా ఇక్కడ మాట్లాడగలరా?
రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ లో చేరి రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని... రేవంత్ ను ఆ పార్టీ నేతలు ఎదగనిస్తారా? అనే అనుమానం వ్యక్తం చేశారు.
టీడీపీలో రేవంత్ కు ఒక పదవి ఉండేదని, ఒక ఆఫీస్, ఒక ఛాంబర్ ఉండేవని... రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా పర్యటించి, తన గళం వినిపించే స్వేచ్ఛ ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ జిల్లాల్లో పర్యటించగలరా? అని అన్నారు. కాంగ్రెస్ నేతలెవరూ కూడా ఇతర నేతలు తమ ఇలాఖాలోకి రావడాన్ని ఇష్టపడరని... తాము ఓటమిపాలైనా సరే వేరే నేతను అడుగుపెట్టనీయరని చెప్పారు.